Karimnagar: రామడుగులో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగులో కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 9 May 2026 2:57 PM IST
Karimnagar: రామడుగులో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం
X

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగులో కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాల్గొన్నారుకరీంనగర్ జిల్లా రామడుగు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు చెందిన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతున్నాయని పేర్కొన్నారు.

అనంతరం గృహ యజమాని శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అభినందించి, కొత్త ఇంట్లో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story