Raikal: రాయికల్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే సంజయ్!

Raikal: రాయికల్ మండలంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. నియోజకవర్గానికి తొలివిడతగా 3,300 ఇళ్లు మంజూరైనట్లు వెల్లడి.

ANAND, JAGITYAL
Published on: 14 Oct 2026 12:37 PM IST
Raikal
X

Raikal: రాయికల్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే సంజయ్!

Raikal: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మండలంలోని కట్కాపూర్ గ్రామానికి చెందిన మంచాల లక్ష్మీ–ధర్మారాజు, కార్కూరి జల–వెంకటేష్ దంపతుల ఇళ్లతో పాటు, అలియా నాయక్ తండాకు చెందిన లావుడియా సుగుణ–రాజు, అనిత–భాషా దంపతుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లబ్ధిదారులకు చీరలను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కట్కాపూర్, ఆలూరు గ్రామాల్లో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారి కలను సాకారం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.

జగిత్యాల నియోజకవర్గానికి కేటాయింపులు:

మొదటి విడత: 3,300 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రెండో విడత: మరో 2,000 ఇళ్లు రానున్నాయి

సామాజిక న్యాయం – కేటాయింపుల వివరాలు:

ఎస్సీ, ఎస్టీలు: 1,189 ఇళ్లు

బీసీలు: 1,674 ఇళ్లు

మైనార్టీలు: 219 ఇళ్లు

అగ్రవర్ణ పేదలు: 78 ఇళ్లు

అర్హులైన ప్రతి నిరుపేదకూ ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా నాయకులు, అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL