Thangallapalli: ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ.. పేదల సొంతింటి కల సాకారం!
Thangallapalli: మల్లాపూర్, సారంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు
Thangallapalli: ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ.. పేదల సొంతింటి కల సాకారం!
తంగళ్లపల్లి: మండలంలోని మల్లాపూర్, సారంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారుల ఇంటి స్థలాల్లో అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాల నర్సింగం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గుగిళ్ళ లావణ్య, వెనమనేని లావణ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరేపెళ్లి బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, హౌసింగ్ ఏఈ హమీద్, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇంటి కలను త్వరలోనే అందిస్తామని నాయకులు తెలిపారు.




