Dubbaka: ధర్మాజీపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక ధర్మాజీపేట వార్డుల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదును ప్రారంభించారు. రూ.5 లక్షల బీమాపై అవగాహన కల్పించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 23 Nov 2026 3:26 PM IST
Dubbaka
X

Dubbaka: ధర్మాజీపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం!

Dubbaka: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 7, 8, 9వ వార్డుల కార్యాలయాల్లో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఆస సులోచన స్వామి, 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, 8వ వార్డు కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్ గౌడ్ పాల్గొని బీమా నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించడం జరిగిందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK