Sircilla: సిరిసిల్ల బైపాస్ రోడ్డు ప్రమాదంలో విషాదం..యువకుడు మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాంతంగా మారింది.
Sircilla: సిరిసిల్ల బైపాస్ రోడ్డు ప్రమాదంలో విషాదం..యువకుడు మృతి!
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాంతంగా మారింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ అనే వ్యక్తి మృతి చెందాడు.
బుధవారం ఉదయం సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న కారు, ముందుగా వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురు గాయపడగా, అభిషేక్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.




