Peddapalli: సింగరేణి కార్మికులకు సొంతిల్లు బాధ్యత INTUCదే.. జనక్ ప్రసాద్!
Peddapalli: గోదావరిఖనిలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఇప్పించే బాధ్యత INTUCదేనని, కొత్త బొగ్గు బ్లాకులు, కాంట్రాక్టు బోనస్ వివరాలు తెలిపారు.
Peddapalli: సింగరేణి కార్మికులకు సొంతిల్లు బాధ్యత INTUCదే.. జనక్ ప్రసాద్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుదవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత INTUC ప్రాతినిధ్య సంఘంగా సింగరేణిలో మూడు సంవత్సరాల కాలంలో మూడు కొత్త బావులను వచ్చామని, మారుపేర్ల కార్మికుల సమస్యపై కమిటి వేయించి, రిపోర్ట్ ఇచ్చేలా కృషి చేశామని తెలిపారు.
సింగరేణి కార్మికులకు సొంతింటి కల నిజం చేసే బాధ్యత కూడా INTUC దేనని, కార్మికులకు స్థలాన్ని కేటాయించి, బ్యాంకర్ల చేత లోన్స్ కూడా ఇప్పిస్తామని జనక్ తెలిపారు. గుర్తింపు సంఘం AITUC మాత్రం కార్మికుల హక్కులను సాధించిన వాటిని మాత్రం తామే సాధించామని చెప్పుకుంటూ పెండింగ్ లో ఉన్నవాటిని మాత్రం సాధించలేదని చెప్పుకోకుండా ప్రభుత్వంపై నెట్టడం జరుగుతుందని ఆరోపించారు.
INTUC యూనియన్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను కొన్నింటిని నెరవేర్చమని, కొన్ని మిగిలి ఉన్నాయని వాటిని కూడా సాగిస్తామనీ నిర్భయంగా చెప్పడం జరుగుతుందని అన్నారు. BRS ప్రభుత్వం ఉన్న సమయంలో బొగ్గు బ్లాకుల వేలంపాటను ఆపకుండా కమిషన్ల కోసం బొగ్గు బ్లాకులను తన బంధువులకు కట్టబెట్టి సింగరేణి ప్రవేటీకరణకు బీజం వేశారని ఇప్పుడు సింగరేణి ప్రవేటీకరణ అవుతుందంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థ పరిరక్షణకు పాటు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, INTUC అని కార్మికవర్గం గుర్తెరగాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే మూడు కొత్త బొగ్గు బ్లాకులు వచ్చాయని మరో పది రోజుల్లో మరో రెండు కొత్త బ్లాకులు వస్తాయని వెల్లడించారు.
దేశంలో ఎక్కడ లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో మాట్లాడి కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటాలో 5,500 రూపాయలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. కార్మికవర్గం శ్రేయస్సు కోసం INTUC పనిచేస్తుందని ఇది కార్మికవర్గం గమనించాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి,ధర్మపురి, దాస్, సదానందం, సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి,శంకర్ రావు,శేషరత్నం, లలితశ్రీ,అక్రమ్, టైసన్ శ్రీను,దశరథం,అనిల్ తదితరులు పాల్గొన్నారు.




