Peddapalli: కూలీల మధ్య ఐటీ మంత్రి జన్మదిన వేడుకలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు.
Peddapalli: కూలీల మధ్య ఐటీ మంత్రి జన్మదిన వేడుకలు
పెద్దపల్లి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 57వ జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి. సర్పంచ్ తుల మనోహర్ రావు ఆధ్వర్యంలో వేడుకలన వైభవంగా నిర్వహించారు. ముందుగా సీతారాముల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఉపాధి హామీ మహిళా కూలీల మధ్య కేక్ కట్ చేసి మంత్రి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధి హామీ కూలీలకు, హమాలి కార్మికులకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తుల మనోహర్ రావు మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా నిరంతరం శ్రమిస్తున్న జనహృదయ నేత, మన ఆప్తులు మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని కూలీల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు తెలంగాణలోనూ అజాతశత్రువుగా ఆయన అందరి మన్ననలు పొందుతున్నారన్నారు.
నాడు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన గొప్ప చరిత్ర శ్రీధర్ బాబు దే అని వారు కొనియాడారు.నేడు ఐటీ మంత్రిగా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, తన తండ్రి దివంగత శ్రీపాదరావు ఆశయాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పదవులు చేపట్టాలని భగవంతుడిని వేడుకున్నట్లు వరకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్యం రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ, ఉప సర్పంచ్ బొమ్మల సుమలత సదయ్య, వార్డు సభ్యులు బెజ్జాల సంపత్, దొమ్మటి పోచాలు, సముద్రాల వసంత రాజేశం, గాదర్ల శారద మొండయ్య, బెజ్జాల మానస రవి మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.




