Manthani: యువతకు ఐటీ స్కిల్స్.. మహిళలకు ఉపాధి.. శ్రీధర్ బాబు
Manthani: మంథనిలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.
Manthani: యువతకు ఐటీ స్కిల్స్.. మహిళలకు ఉపాధి.. శ్రీధర్ బాబు
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సెంటర్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. అలాగే మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపూర్ వద్ద మహిళలకు సంబంధించిన గార్మెంటరీ యూనిట్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
యువతకు సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిభకు సంబంధించి మంథని ఎదగాలని స్కిల్స్ సెంటర్లను తీసుకువస్తున్నామని తెలిపారు. ఐటీ డిపార్ట్మెంట్ లో భాగమైన టాస్క్ ను కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ప్రయత్నాలు చేస్తున్నాం యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మైకు దొరికిందని ఇంట్లో పురాణాలు చేసే ప్రసక్తి ఉండదని చిల్లర రాజకీయాల్లోకి పోనని అన్నారు. నేను చెప్పినట్లే పనిలో చూపిస్తానని పరిశ్రమలు రావాలంటే కష్టమని ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రాలు అనేకం ఏర్పాటు చేశామని వందలాది మంది సోదరీమణులు శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు.
సుమారు 400 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అందులో భాగంగానే ప్లగ్ అండ్ ప్లే అను వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. దానికి అందరూ సహకరించాలని కోరారు. ఈరోజు మంథనిలో ఆ బిల్డింగ్ కి శంకుస్థాపన చేస్తున్నామని త్వరలోనే చిన్నచిన్న పరిశ్రమల కంపెనీలతో మాట్లాడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.




