Jagtial: మెట్‌పల్లి వద్ద దారుణ రోడ్డు ప్రమాదం

Jagtial: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి అరపేట శివారులో ఆటో బోల్తా పడి 10 మందికి తీవ్ర గాయాలు. ఆరుగురి పరిస్థితి విషమం, మాచాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 10 Nov 2026 8:31 PM IST
Jagtial
X

Jagtial: మెట్‌పల్లి వద్ద దారుణ రోడ్డు ప్రమాదం

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్టుపల్లి పట్టణంలోని అరపేట శివారులో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ​

జగిత్యాల జిల్లా మెట్టుపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మెట్టుపల్లి పట్టణంలోని రేగుంటలో జరుగుతున్న ఒక శుభకార్యానికి ఆటోలో బయలుదేరారు.

​అయితే ఆటో అరపేట శివారులోకి రాగానే అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ఉన్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు.

​సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, వారికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాల మరియు కరీంనగర్, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

​పండుగలు, శుభకార్యాల వేళ ఈ ఘోర ప్రమాదం జరగడంతో మాచాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA