Jagtial: డి.ఏ.పీ అదనపు ధరలపై కలెక్టర్‌కు డా. బోగ శ్రావణి ఫిర్యాదు

Jagtial: జగిత్యాలలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు DAP విక్రయిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు బీజేపీ నేత డా. బోగ శ్రావణి వినతిపత్రం అందజేశారు.

ANAND, JAGITYAL
Published on: 27 July 2026 11:19 PM IST
Jagtial
X

Jagtial: డి.ఏ.పీ అదనపు ధరలపై కలెక్టర్‌కు డా. బోగ శ్రావణి ఫిర్యాదు

జగిత్యాల: రైతులకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు డి.ఏ.పీ. ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఎమ్మార్పీ ధర ₹1,350 ఉన్న డి.ఏ.పీ. బస్తాను కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ₹1,950 వరకు విక్రయిస్తూ, రైతుల నుంచి రూ. 600 అదనంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనిఖీలు నిర్వహించి బాధ్యులైన డీలర్ల షాపులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, పాత రమేష్, మమత, శేఖర్ రెడ్డి, అశోక్, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story