Jagtial: కోరుట్ల ఫామ్‌హౌస్‌లో రహస్యంగా సమావేశమైన 300 మంది నాయకులు

Jagtial: జగిత్యాల జిల్లా బీజేపీలో తిరుగుబాటు చెలరేగింది. కోరుట్ల సమీపంలోని ఫామ్‌హౌస్‌లో 300 మంది సీనియర్ నేతలు రహస్యంగా సమావేశమై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ANAND, JAGITYAL
Published on: 29 Aug 2026 11:22 PM IST
Jagtial
X

Jagtial: కోరుట్ల ఫామ్‌హౌస్‌లో రహస్యంగా సమావేశమైన 300 మంది నాయకులు

జగిత్యాల: జగిత్యాల జిల్లా బిజెపిలో తిరుగుబాటు బావుటా ఎగిరింది. కోరుట్ల సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన సుమారు 300 మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు రహస్యంగా సమావేశమయ్యారు.

పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన తమను పక్కనబెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిపూజ ఎక్కువై సిద్ధాంతం పక్కకు పోతోందని మండిపడ్డారు. ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టిన భోగ శ్రావణికి ఎంపీ అరవింద్ తన తండ్రి కారును బహుమతిగా ఇస్తూ, "ఎమ్మెల్యేగా గెలిచాకే ఈ కారులో నా వద్దకు రావాలి" అని చేసిన వ్యాఖ్యలే ఈ అసమ్మతికి ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో గతంలో వేర్వేరు వర్గాలుగా ఉన్న సీనియర్ నేతలు ముదుగంటి రవీందర్ రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ రావు చేతులు కలిపి, పార్టీ పరిరక్షణకు ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. స్థానికంగా ఈ భేటీ తీవ్ర కలకలం రేపగా, అధిష్టానం స్పందనపై ఉత్కంఠ నెలకొంది.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story