Jagtial: 13,913 మందికి కొత్త 'చేయూత' పింఛన్ల పంపిణీ
Jagtial: జగిత్యాల జిల్లాలో కొత్తగా మంజూరైన 13,913 మంది అర్హులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేయూత పింఛన్ పత్రాలను అందజేశారు.
Jagtial: 13,913 మందికి కొత్త 'చేయూత' పింఛన్ల పంపిణీ
జగిత్యాల: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్‌లతో కలిసి జిల్లాలో కొత్తగా మంజూరైన 13,913 మందికి చేయూత పింఛన్ పత్రాలను మంత్రి అందజేశారు.
18,955 దరఖాస్తులలో అర్హులను గుర్తించామని, పింఛన్ రాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త పింఛన్లలో వితంతువులు 6,434, దివ్యాంగులు 2,710, గీత కార్మికులు 1,873, ఒంటరి మహిళలు 1,714, ఫైలేరియా బాధితులు 1,082, చేనేత కార్మికులు 100 మంది ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు.




