Jagtial: జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ
Jagtial: జగిత్యాల ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ జ్వరాలు, ఆసుపత్రిలో మౌలిక వసతులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Jagtial: జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల: వర్షాల నేపథ్యంలో వ్యాపిస్తున్న సీజనల్ జ్వరాల పట్ల వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు అందుతున్న అత్యవసర వైద్య సేవలను సమీక్షించారు. డయాలసిస్, ఎమర్జెన్సీ వార్డులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
ఆసుపత్రిలో నెలకొన్న పార్కింగ్, రూఫ్ లీకేజీలు, ధోబీ రూమ్, కిచెన్ సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా... రాబోయే నెల రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టెర్రస్‌పై పేరుకుపోయిన వ్యర్థాలను రెండు వారాల్లోగా తొలగించాలని, రాబోయే 2-3 నెలల్లో ఆరోగ్యశ్రీ సేవల నమోదును పెంచి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనంతరం నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను పరిశీలించి, మిగిలిన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.




