Dharmapuri: ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో ఘనంగా భరణి నక్షత్ర పూజలు!

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా మూల విగ్రహానికి పంచామృతాభిషేకం, ఆయుష్య హోమం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

RAMESH, DHARMPURI
Published on: 23 Nov 2026 12:17 PM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో ఘనంగా భరణి నక్షత్ర పూజలు!

ధర్మపురి: భారతదేశంలోని అరుదైన దేవాలయాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ యమధర్మరాజు ఆలయంలో ఈరోజు భరణి నక్షత్రం సందర్భంగా. యమ ధర్మరాజు మూల విగ్రహానికి అర్చకులు పంచామృతాలతో వేదొక్తంగా అభిషేకము నిర్వహించారు. అప్ప మృత్యు బాధలు తొలగిపోవాలని ఆయుష్య హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం యమధర్మరాజుకు నివేదన. నక్షత్ర హారతి. కుంభహారతి. కర్పూర హారతి. మంత్రపుష్పం సమర్పించారు. భక్తులకు వేద ఆశీర్వచనం అందజేశారు. భక్తులు వారి వారి యమగండ దోషాలు తొలగిపోవాలని గండ దీపంలో నువ్వుల నూనె పోసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజు ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI