Jagtial: జగిత్యాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 1000 ఈత మొక్కల నాటకం!
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి ఈత మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Jagtial: జగిత్యాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 1000 ఈత మొక్కల నాటకం!
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కోనాపూర్, తిరుమలాపూర్ గ్రామాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల అభివృద్ధి, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఈత మొక్కలను నాటి, వాటికి నీరు పోసి సంరక్షణ బాధ్యత గౌడ సంఘ సభ్యులు తీసుకోవాలన్నారు. వన ప్రాంతాల్లో స్థానిక జాతుల మొక్కలను విస్తృతంగా పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది, నారాయణ, ప్రవీణ్, అధ్యక్షులు పరిసరాములు గౌడ్, తిరుమలాపూర్ సర్పంచ్, పైదల అంజయ్య, నాయకులు బుర్ర సంతోష్ గౌడ్, శేఖర్, సంతోష్,గ్రామస్థులు, రైతులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




