Jagtial: 'పుష్ప' రేంజ్ అక్రమ మద్యం దందా.. సీక్రెట్ రూట్ బట్టబయలు!
Jagtial: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో పుష్ప సినిమా తరహాలో సీక్రెట్ కంపార్ట్‌మెంట్ వాహనంలో అక్రమ మద్యం రవాణా. 70 బాక్సుల మద్యం సీజ్, ముగ్గురి అరెస్ట్.
Jagtial: 'పుష్ప' రేంజ్ అక్రమ మద్యం దందా.. సీక్రెట్ రూట్ బట్టబయలు!
Jagtial: జగిత్యాల జిల్లాలో అచ్చం 'పుష్ప' సినిమా తరహాలో ప్లాన్ చేసిన అక్రమ మద్యం దందా గుట్టు రట్టైంది. సీక్రెట్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసి సరిహద్దులు దాటిస్తున్న లేటెస్ట్ నెట్‌వర్క్‌పై మెట్టుపల్లి ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
పుష్ప సినిమాలో ఎర్రచందనం తరలించినట్లే ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ మద్యం రవాణా కోసం నిందితులు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని డిజైన్ చేయించారు.
రహస్య సమాచారంతో కథలాపూర్ మండలం తాండ్రియాల శివారులో జిల్లా మరియు మెట్టుపల్లి ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గంభీర్‌పూర్‌కు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
వాహనంలో దాచిన 70 బాక్సుల అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ₹2,08,000 రూపాయల విలువ ఉండగా, తెలంగాణలో ₹6,98,000 రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని దాద్రా, నాగర్, హవేలీ మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన డయ్యూ, దామన్ ప్రాంతాల నుంచి తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి, తెలంగాణలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి, మెట్టుపల్లి ఎక్సైజ్ బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుల వద్ద నుంచి మద్యం బాక్సులతో పాటు, రవాణాకు ఉపయోగించిన ట్రాలీ ఆటో, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
గత 20 రోజుల్లోనే కథలాపూర్ మండలంలో అక్రమ మద్యం పట్టుకోవడం ఇది రెండవసారి.




