Jagtial: కల్లేపల్లి మోడల్ స్కూల్‌లో హస్తా (13) మిస్సింగ్ కేసు నమోదు!

Jagtial: జగిత్యాల మండలం కల్లేపల్లి మోడల్ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని హస్తా (13) కనిపించకుండా పోవడం కలకలం రేపింది.

ANAND, JAGITYAL
Published on: 6 Aug 2026 7:49 PM IST
Jagtial
X

Jagtial: కల్లేపల్లి మోడల్ స్కూల్‌లో హస్తా (13) మిస్సింగ్ కేసు నమోదు!

జగిత్యాల జిల్లా: జగిత్యాల మండలం కల్లేపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ నుండి 7 వ తరగతి చదువుతున్న విద్యార్థిని హస్తా (13) నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కూలు నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవటం కలకలం రేపింది.

విద్యార్థిని తనతో తెచ్చుకున్న డ్రెస్ స్కూల్ ఆవరణలో మార్చుకొని తనకు సంబంధించిన బుక్స్ , బ్యాగ్, బూట్లు, వదిలేసి బ్యాగులో ఓ లెటర్ పెట్టి తన తల్లి దండ్రులతో ఇబ్బందిగా ఉంది. చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు.

ఇక్కడ ఉండలేను అని వ్రాసి వెళ్ళింది. టీచర్ లు క్లాస్ లో బిసిగా ఉండగా ఎవరు చూడని సమయంలో పక్క ప్రణాళికతో వెళ్ళిన సంఘటన అందరిని ఆచర్యానికి గురిచేసింది..టీచర్ లు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story