Jagtial: జగిత్యాలలో సైబర్ మోసం వాట్సాప్ APK క్లిక్ చేసి రూ. 4.15 లక్షలు స్వాహా!

Jagtial: జగిత్యాల వాణీనగర్‌లో సైబర్ మోసం. వాట్సాప్‌లో వచ్చిన అపరిచిత APK ఫైల్ క్లిక్ చేయడంతో రూ. 4.15 లక్షలు గల్లంతు. పోలీసులు అప్రమత్తత హెచ్చరిక.

ANAND, JAGITYAL
Published on: 16 Aug 2026 6:50 AM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో సైబర్ మోసం వాట్సాప్ APK క్లిక్ చేసి రూ. 4.15 లక్షలు స్వాహా!

Jagtial: వాట్సాప్‌కు వచ్చిన ఒక అపరిచిత APK ఫైల్‌ను క్లిక్ చేయడంతో ఓ వ్యక్తి ఖాతా నుండి ఏకంగా రూ. 4.15 లక్షలు గల్లంతైన ఘటన జగిత్యాల పట్టణంలో కలకలం రేపింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఎలిగేటి అశోక్‌కు ఇటీవల వాట్సాప్‌లో ఒక గుర్తుతెలియని ఫైల్ (APK File) వచ్చింది. ఏంటోనని దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు.

అయితే, కొద్దిసేపటికే అశోక్ బ్యాంకు ఖాతా నుండి విడతల వారీగా డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌లు రావడం ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా తన ఖాతాలోని రూ. 4.15 లక్షలు ఖాళీ అవ్వడంతో బాధితుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బ్యాంకు నిర్లక్ష్యంపై బాధితుడి ఆవేదన: వెంటనే ఆయన గాయత్రి బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా, వారు కనీసం సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలనే సూచన కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అశోక్ ఆరోపించారు.

మరుసటి రోజు తన స్నేహితుడైన ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను కలవడంతో అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల హెచ్చరిక: వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే అపరిచిత లింకులు, APK ఫైళ్లను (యాప్‌ల డౌన్‌లోడ్ ఫైల్స్) ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను కోరారు. ఏవైనా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story