Jagtial: సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

Jagtial: జగిత్యాల జిల్లా బంజారా సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆలయాల నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమిపూజ చేశారు.

ANAND, JAGITYAL
Published on: 16 Nov 2026 8:33 PM IST
Jagtial
X

Jagtial: సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జగిత్యాల: జగిత్యాల జిల్లా బంజారా సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆలయాల నిర్మాణానికి భూమిపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న బంజారా సంఘం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఆలయాలు ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బంజారాల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, సేవాలాల్ కమిటీ జిల్లా అధ్యక్షుడు భూక్య నందు నాయక్, జగిత్యాల, రాయికల్ ఏఎంసీ చైర్మన్లు గడ్డం నారాయణ రెడ్డి, రవీందర్ రావు, కౌన్సిలర్ ప్రశాంత్ రావు, మహిళా అధ్యక్షురాలు అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, సురేందర్ నాయక్, కమిటీ ప్రధాన కార్యదర్శులు మాలోత్ లచ్చ నాయక్, రవి నాయక్, సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్, సర్పంచులు ప్రసాద్, సంతోష్, రమేష్, తిరుపతి, సాగర్, నాయకులు భూక్య మురళి నాయక్, ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL