Jagtial: చర్లపల్లిలో రూ. 37 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే!

Jagtial: జగిత్యాల మండలం చర్లపల్లిలో రూ. 37 లక్షల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు.

ANAND, JAGITYAL
Published on: 11 Nov 2026 5:04 PM IST
Jagtial
X

Jagtial: చర్లపల్లిలో రూ. 37 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే!

Jagtial: జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రూ.25 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్క నాటారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా చర్లపల్లి గ్రామంలో రూ.3.50 లక్షల వ్యయంతో చేపడుతున్న 'మ్యాజిక్ డ్రెయిన్' పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.5 లక్షల చొప్పున కేటాయించిన మున్నూరుకాపు, రెడ్డి కుల సంఘాల భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం:

అనంతరం గ్రామానికి చెందిన లబ్ధిదారులు దీటి లావణ్య–రాజయ్య, గడ్డం అంజయ్య-ఈశ్వరి దంపతుల నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని, రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు కొత్త చీరలు కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు:

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనందరెడ్డి, డిసిసి అధ్యక్షులు గజంగి నందయ్య, ఎఎంసి చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ (ఎమ్మెర్వో) హకీమ్, ఎంపీఓ రవి బాబు, డీఈ మిలింద్, జిల్లా మండల సర్పంచుల ఫోరం నాయకులు బొలిశెట్టి గంగారెడ్డి,

కట్ట రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, ఏఈ విజయ్, మాజీ సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ దుమాల సుమన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL