Jagtial: పౌలస్త్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సంజయ్
Jagtial: జగిత్యాల మండలం పొలాస శ్రీ పౌలస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేసి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
Jagtial: పౌలస్త్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: జగిత్యాల మండలం పొలాస గ్రామంలోని ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ పౌలస్త్యేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో ఎమ్మెల్యేను సత్కరించి, ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. చారిత్రక నేపథ్యం కలిగిన పొలాస శ్రీ పౌలస్త్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ సర్పంచ్ శంకర్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఆలయ చైర్మన్ భూమన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలముకుందం, ఏఎంసీ డైరెక్టర్ జైరాం సురేష్, సత్యనారాయణ గౌడ్, తిరుపతి గౌడ్, ఆలయ ఈవో మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




