Jagtial: 12 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డా. సంజయ్ ఉచిత కంటి ఆపరేషన్లు

Jagtial: జగిత్యాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. 12 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి మందులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.

ANAND, JAGITYAL
Published on: 10 Oct 2026 7:03 PM IST
Jagtial
X

Jagtial: 12 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డా. సంజయ్ ఉచిత కంటి ఆపరేషన్లు

జగిత్యాల: పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎంపిక చేసిన జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 12 మంది నిరుపేదలకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు (అపరేషన్లు) పూర్తి చేశారు.

అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కంటి అద్దాలు, అవసరమైన మందులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిరుపేదలకు దృష్టి లోపాలను నివారించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రోటరీ క్లబ్ నిరంతరం కృషి చేయడం అభినందనీయమన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్యులు ఎం ఎల్ ఏ డాక్టర్ విజయ్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL