Jagtial: జగిత్యాలలో డిసెంబర్ 2న 145 వాహనాల బహిరంగ వేలం.. ఎస్పీ!

Jagtial: జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 145 క్లెయిమ్ చేయని వాహనాల బహిరంగ వేలం డిసెంబర్ 2న ధారూర్ క్యాంప్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహణ.

ANAND, JAGITYAL
Published on: 25 Nov 2026 5:22 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో డిసెంబర్ 2న 145 వాహనాల బహిరంగ వేలం.. ఎస్పీ!

Jagtial: జిల్లా పోలీస్ శాఖ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుని, క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన 145 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జగిత్యాలలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో భద్రపరిచిన ఈ వాహనాలను 2026 డిసెంబర్ 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ధారూర్ క్యాంప్‌లోని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.

వేలంలో ఉంచిన వాహనాల వివరాలు:

ద్విచక్ర వాహనాలు (టూ-వీలర్స్): 131

త్రిచక్ర వాహనాలు (ఆటోలు/త్రీ-వీలర్స్): ౧౩

నాలుగు చక్రాల వాహనం (ఫోర్-వీలర్): 01

మొత్తం వాహనాలు: 145

పాల్గొనే వారికి సూచనలు:

వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 2న ఉదయం 10 గంటల కల్లా తమ వెంట సరైన గుర్తింపు కార్డు (ID Proof) తీసుకుని ధారూర్ క్యాంప్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు నేరుగా హాజరుకావాలని ఎస్పీ సూచించారు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL