Mogilipeet: రోడ్డు ప్రమాద బాధితుడిని సుజిత్ రావు పరామర్శించారు!

Mogilipeet: జగిత్యాల జిల్లా మొగిలిపేటలో రోడ్డు ప్రమాద బాధితుడిని టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పరామర్శించి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2026 9:19 AM IST
Mogilipeet
X

Mogilipeet: రోడ్డు ప్రమాద బాధితుడిని సుజిత్ రావు పరామర్శించారు!

Mogilipeet: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన మాజీ విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్ రెడ్డి చిన్న కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు శనివారం వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు.

​ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర ఫిషర్మన్ ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా, మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, పాతదాంరాజ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేష్, ఇబ్రహీంపట్నం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్ తో పాటు నాయకులు వెంకట గిరి, మొగిలి రాజేందర్, సుద్దాల సతీష్, సమీర్ సర్కార

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story