Jagtial: ధరూర్ అభివృద్ధికి ఎంపీ అరవింద్ నిధులు: బోగ శ్రావణి!

Jagtial: జగిత్యాల అర్బన్ ధరూర్ గ్రామంలో భవనాల నిర్మాణానికి ఎంపీ అరవింద్ ధర్మపురి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రొసీడింగ్స్‌ను డాక్టర్ బోగ శ్రావణి అందజేశారు.

ANAND, JAGITYAL
Published on: 9 Nov 2026 5:33 PM IST
Jagtial
X

Jagtial: ధరూర్ అభివృద్ధికి ఎంపీ అరవింద్ నిధులు: బోగ శ్రావణి!

జగిత్యాల అర్బన్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి నిధులు మంజూరు చేశారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ మరియు మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి మంజూరైన ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి సోమవారం గ్రామ ప్రజలకు, సంఘ ప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, సామాజిక వర్గాలకు ఉపయోగపడే భవనాల నిర్మాణానికి ఎంపీ నిధులు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయించిన ఎంపీ అరవింద్ ధర్మపురికి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాదారి అశోక్, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరపాక అశోక్, అర్బన్ మండల ఉపాధ్యక్షుడు తిరుపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు దానపనేని నరేష్, నాయకులు సల్ల రమేష్, ఇట్యాల రాము, మ్యాదరి శ్రీనివాస్, మారవేణి మల్లేశం, బింగిశెట్టి తిరుపతి, పంబల వసంత్, బలె సంతోష్, అక్కినపల్లి కాశీనాథం, ఇనుగుర్తి శ్రీనివాస్, గ్రామ పెద్దలు, సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL