Jagtial: జగిత్యాలలో ఎల్.జి. రామ్, పోరండ్ల ప్రభాకర్ జయంతి వేడుకలు!

Jagtial: జగిత్యాల వాల్మీకి ఆవాసంలో కీ.శే. ఎల్.జి. రామ్, పోరండ్ల ప్రభాకర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు అన్నదానం, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.

ANAND, JAGITYAL
Published on: 9 Nov 2026 5:37 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో ఎల్.జి. రామ్, పోరండ్ల ప్రభాకర్ జయంతి వేడుకలు!

జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి, జగిత్యాల ప్రముఖ వ్యాపారవేత్త, ఎల్.జి. రామ్ హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ కీ.శే. ఎల్.జి. రామ్ మరియు వారి అల్లుడు కీ.శే. పోరండ్ల ప్రభాకర్ల జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు అన్నదానం, స్వీట్లు, పండ్లు మరియు పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ.. ఎల్.జి. రామ్ సొసైటీ ద్వారా 35 వేల కుటుంబాలకు ఆరోగ్య, ప్రమాద బీమా చేయించి అనేకమందికి ఆర్థిక లబ్ధి చేకూర్చారని, అలాగే డ్రైవర్లకు ప్రమాద బీమా, ఉచిత హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులకు ఒక్కరోజు భోజన ఖర్చులు అందించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేసినందుకు వాల్మీకి ఆవాస నిర్వాహకులు వారి కుటుంబ సభ్యులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో BRS పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, ఎల్. శ్రీనివాస్, కౌన్సిలర్ కోరుకంటి రాము, నాయకులు వొళ్ళేం మల్లేశం, వొళ్ళాల గంగాధర్, వనమాల నిరంజన్, కుడిక్యాల సర్వేశ్వర్, అజ్ఘర్ మహమ్మద్ ఖాన్, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి వేణుమాధవ్, శేఖర్, పెండం గంగాధర్, వావిలాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL