Jagtial: కేంద్రీయ విద్యాలయ చెల్గల్‌లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రీయ విద్యాలయ చెల్గల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉపాధ్యాయ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు. వివరాలు వెల్లడించిన కలెక్టర్.
Jagtial: కేంద్రీయ విద్యాలయ చెల్గల్‌లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రీయ విద్యాలయ చెల్గల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది ఎంపిక ప్యానెల్ తయారీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
బాలవాటిక ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉపాధ్యాయులు (PRTs) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు 24.08.2026న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. అలాగే కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, సంగీతం/నృత్య శిక్షకులు (Music/Dance Coach) పోస్టుల కోసం 25.08.2026న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు, ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీల్లో కేంద్రీయ విద్యాలయ చెల్గల్‌కు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.
ఇంటర్వ్యూలకు సంబంధించిన అర్హతలు, ఖాళీలు, సమయాలు, అవసరమైన ధ్రువపత్రాలు తదితర పూర్తి వివరాల కోసం కేంద్రీయ విద్యాలయ చెల్గల్‌ను సంప్రదించడంతో పాటు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్‌ను https://karimnagar.kvs.ac.in/ సందర్శించాలని ఆయన తెలిపారు.




