Jagtial: జగిత్యాలలో యువకుడిపై కత్తితో దాడి.. తీవ్రగాయాలు

Jagtial: జగిత్యాల రూరల్ మండలం చల్గల్‌లో యువకుడు శ్రవణ్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANAND, JAGITYAL
Published on: 16 Oct 2026 11:32 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో యువకుడిపై కత్తితో దాడి.. తీవ్రగాయాలు

జగిత్యాల: జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్ గ్రామంలో శనివారం ఉదయం ఓ యువకుడిపై కత్తితో దారుణమైన దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. చల్గల్ గ్రామానికి చెందిన శ్రవణ్ అనే యువకుడిని, అదే గ్రామానికి చెందిన ఎండీ సమీర్ మరియు రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన బత్తుల అనిల్‌లు ఇంటి వద్ద నుంచి బయటకు పిలిచారు. "మాట్లాడుకుందాం" అంటూ అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి, వెంట తెచ్చిన కత్తితో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రవణ్‌ను వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి వైద్యం అందిస్తున్నారు.

డీమార్ట్‌లో ఉద్యోగులుగా గుర్తింపు:

దాడికి పాల్పడిన నిందితులు ఇద్దరూ జగిత్యాలలోని డీమార్ట్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

పోలీసుల దర్యాప్తు:

ఘటన గురించి సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ ఎస్సై వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL