Jammikunta: జమ్మికుంటలో చనిపోయిన మిత్రుడి కుటుంబానికి రూ. లక్ష సాయం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో స్నేహం గొప్పదనాన్ని చాటిచెప్పే ఘటన వెలుగుచూసింది.
Jammikunta: జమ్మికుంటలో చనిపోయిన మిత్రుడి కుటుంబానికి రూ. లక్ష సాయం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బాల్యమిత్రుడు గుండా సురేందర్ ఇటీవలే గుండెపోటుతో వడ దెబ్బకు గురై మృతి చెందాడు. బాల్యమిత్రుడు దూరమైన సురేందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పి ఉన్నత పాఠశాల (1983 -84 ) పదవ తరగతి బ్యాచ్ ఆయనతో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు రూ. 1 లక్ష తమ వంతు చేయూతగా ఈరోజు మిత్రుడి కుటుంబానికి అందజేశారు. మృతి చెందిన మిత్రుడు సురేందర్ కూతురు పేరిట ఫిక్స డ్ డిపాజిట్ చేయడం జరిగింది.
కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మనమంతా స్నేహమేరా జీవితం అనే నానుడికి పూర్తిగా ఐక్యతతో ముందుకు సాగుతామని మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని మిత్రులు భరోసా ఇచ్చారు. లక్ష రూపాయల చెక్కును అందజేసిన వారిలో పాల్గొన్న బాల్య మిత్రుల సేవాసమితి మిత్ర బృందం. మంద వెంకట్ రెడ్డి, కనుమల్ల గణపతి, ఆర్. సంపత్ కుమార్, పెంచలయ్య, కొక్కుల రాజేందర్, డి. రాజేందర్, సాంబయ్య, సమ్మయ్య, గుడిమల్ల బలరాం, ఎ.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




