Jammikunta: జమ్మికుంటలో డీజే పాటలతో మే డే ర్యాలీ.. మార్కెట్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
Jammikunta: జమ్మికుంట పట్టణంలో మే డే సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
Jammikunta: జమ్మికుంటలో డీజే పాటలతో మే డే ర్యాలీ.. మార్కెట్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరు స్వప్న సదానంద ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు డీజే పాటలు డ్యాన్సులతో నిర్వహించిన ర్యాలీ కార్మిక హక్కులపై గట్టిగా స్వరం వినిపించింది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కార్మిక చట్టాల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆమె మాట్లాడుతూ “దేశంలో కార్మికుల కోసం ఎన్నో చట్టాలు ఉన్నా, అవి పుస్తకాలకే పరిమితమవుతున్నాయి. కనీస వేతనాలు, పని గంటలు, భద్రతా ప్రమాణాలు అన్నీ కేవలం కాగితాలపైనే ఉంటున్నాయి. కార్మికులు ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారు. ఎనిమిది గంటల పనిదినం అనే హక్కు కోసం పూర్వం కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కానీ నేటికీ అనేక చోట్ల 10 నుండి 12 గంటలు పని చేయిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం” అని ఘాటుగా విమర్శించారు.
పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని, కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో జిల్లా మంత్రి పొన్నంప్రభాకర్.హుజురాబాద్ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కార్మికుల కోసం ఎనలేని కృషి చేస్తుందని గత ప్రభుత్వాలలో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల కోసం సరైన వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు, అన్ ఆర్గనైజ్డ్ రంగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, వారికోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మికుంట పాత మార్కెట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. మార్కెట్‌కు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ కార్మిక హక్కుల కోసం తమ ఐక్యతను చాటారు. మే డే స్పూర్తిని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమం లో మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి ఆర్థిదారుల సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు. హమాలీ సంఘం అధ్యక్షులు సంబమూర్తి మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ డైరెక్టర్లు మార్కెట్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది దాడువాయిలు మహిళా కార్మికులు తదితర కార్మికులు పాల్గొన్నారు.




