Jammikunta: ఫీజు బకాయిలు విడుదల చేయాలి జమ్మికుంటలో బీజేపీ నిరసన
Jammikunta: జమ్మికుంటలో బీజేపీ లడాయి కార్యక్రమం. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన యువమోర్చా నాయకులు.
Jammikunta: ఫీజు బకాయిలు విడుదల చేయాలి జమ్మికుంటలో బీజేపీ నిరసన
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బిజెపి పార్టీ, యువ మోర్చ ఆధ్వర్యంలోఫీజుల బకాయి బిజెపి లడాయి కార్యక్రమాన్ని బిజెపి పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, యువ మోర్చ అధ్యక్షులు తుర్పాటి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా యువ మోర్చ జిల్లా అధ్యక్షులు సంగ నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులతో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, పెండింగ్ ఉన్న 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని, డిమాండ్ చేశారు.
ఇంజనీరింగ్ విద్యార్థులను ఇడియట్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం సిగ్గు చేటు అని, వెంటనే విద్యార్థులకు సిఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, కైలాసకొటి గణేష్, రాచపల్లి ప్రశాంత్, అడువాల శ్రీధర్, శ్రీవర్తి ప్రవీణ్, గట్టు సాయిరాం, ప్రణిత్, పసునూటి శివ, పనికారి రమేష్, పొడెటి అనిల్, సిరియాల విజయ్, కొలకాని అరవింద్, చందా సంతోష్ తదితరులు పాల్గొన్నారు




