Jammikunta: జమ్మికుంటలో ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు

Jammikunta: జమ్మికుంటలో ఘనంగా వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు. హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ప్రత్యేక గీతం ఆవిష్కరణ, కేక్ కటింగ్.

GANESH, JAMMIKUNTA
Published on: 15 Aug 2026 9:50 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు

జమ్మికుంట:కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి ఏరియాలో హనుమాన్ చౌరస్తా వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. కూతాడి తిరుపతి, బొంగోని వీరన్న పంజాల అజయ్ మర్రి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రణవ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ దేశిని స్వప్న కోటి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రణవ్ బాబు జన్మదిన గీతాన్ని ప్రణవ్ బాబు స్వయంగా ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రణవ్ బాబును భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. పూలమాలలు, శుభాకాంక్షలతో హనుమాన్ చౌరస్తా వద్ద సందడి వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. ప్రణవ్ బాబు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారని అన్నారు. పేదల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన నిలబడే నాయకత్వం ప్రణవ్ బాబుదని పేర్కొన్నారు. యువత, పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతున్నారని తెలిపారు.

దేశిని కోటి మాట్లాడుతూ దేశిని కోటి మాట్లాడుతూ.“ప్రణవ్ బాబు పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల గుండెచప్పుడు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, వారికి అండగా నిలుస్తున్న నాయకుడు ప్రణవ్ బాబు. ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

ప్రణవ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రణవ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు చందరాజు శ్రీపతి నరేష్ యాట్ల సునీత అశోక్ ఒగ్గు రమేష్ మాచర్ల రాజు పొనగంటి విష్ణు ఎగిత సుజాత అశోక్ పాతకాల మౌనిక అనిల్ బత్తుల లక్ష్మణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి దుబ్బ మల్లన్న దేవస్థాన చైర్మన్ ముద్దమల్ల రవి మాజీ కౌన్సిలర్లు శ్రీహరి రవీందర్ సదానందం బిక్షపతి మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న పిడుగు భాగ్యలక్ష్మి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొడిగె శ్రీకాంత్ రాజ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ఎండి సలీం ఎగ్గని శ్రీనివాస్ టెంకురాల కిషోర్ పాత ప్రసాద్ దేశిని శ్రీనివాస్ మెట్టు వినయ్ కొండిల్ల వెంకటేష్ బొంగుని సదానందం రాచమల్ల మధు మారుతి రెడ్డి కందికట్ల రాజేష్ బలబత్తుల శ్రీకాంత్ గోపి రాజేష్. సప్న. భాగ్య తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story