Jammikunta: జమ్మికుంట మార్కెట్ చైర్‌పర్సన్ ఘన సన్మానం

Jammikunta: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్నకు ఘన సన్మానం. మక్కల కొనుగోలులో రైతులకు సేవలు అందించినందుకు అభినందించిన రైతులు.

GANESH, JAMMIKUNTA
Published on: 15 Aug 2026 9:35 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట మార్కెట్ చైర్‌పర్సన్ ఘన సన్మానం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న సదానందంను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వావిలాల గ్రామానికి చెందిన రైతులు పొన్నం తిరుపతి గౌడ్, రాచమల్ల శివ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటం ఉన్న గడియారాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రైతు పొన్నం తిరుపతి గౌడ్ మాట్లాడుతూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్సౌకర్యాన్ని.అందిపుచ్చుకొనిమక్కల కొనుగోలు సమయంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మార్కెట్ చైర్‌పర్సన్ కృషి చేశారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ ఇదే విధంగా చొరవ చూపాలని ఆకాంక్షించారు. రైతులు తనను సన్మానించడం పట్ల చైర్‌పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కు పంట ఉత్పత్తులను తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు కొనసాగిస్తామని చైర్ పర్సన్ స్వప్న సదానందం హామీ ఇచ్చారు. ఇరివెంట మార్కెట్ కార్యదర్శి మల్లేశం.రాజ్ మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story