Jammikunta: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట గీతా మందిర్‌లో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో గోపష్టమి వేడుకలు, గోపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 17 Nov 2026 11:31 PM IST
Jammikunta
X

Jammikunta: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వివిధ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు హిందూ బంధువులు స్వాగతం గురుస్వాములు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమానికి ప్రాంత విశ్వహిందం గో రక్ష సంపర్క ప్రముఖ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

మాట్లాడుతూ గోవు హిందువుల యొక్క పవిత్రముగా చూసుకునే జంతువు గోవు కావున గోవధను నిషేధించాలి గోవులకు గోశాలను నిర్మించాలి .గో ప్రోడక్ట్ ఉత్పత్తి చేయాలి గోవు ప్రతి ఇంటికి ఉండాలి. గోసమ్మ అభియాన్ సందర్భంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి ప్రతి హిందువు గోవును పరమ పదిగ పూజించాలి. ప్రతి ఇంటికి గోవు ఉండాలి బాధ్యత అని వారు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.

గోశాల నిర్మాణం కోసం జమ్మికుంట పట్టణ రెవెన్యూ ఆఫీసర్ ని డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ ని కలిసి వారికి వినంబరంగా వినతి పత్రం సమర్పించడం కూడా జరిగింది వారు ఇట్టి విషయాన్ని సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే గోశాలకు సంబంధించిన గో భూమిని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకి తీర్థ ప్రసాదాలు వితరణ కూడా చేయడం జరిగింది గీతా మందిర కమిటీ ఆధ్వర్యంలో. భారత్ మాతాకీ జై శ్రీరామ్ భక్తితో నినాదాలు చేశారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA