Jammikunta: రిజర్వేషన్లపై కుట్రలను తిప్పికొట్టాలి – కొంగరి శంకర్ మాదిగ

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన మాదిగ హక్కుల దండోరా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం.

GANESH, JAMMIKUNTA
Published on: 23 Aug 2026 7:35 PM IST
Jammikunta
X

Jammikunta: రిజర్వేషన్లపై కుట్రలను తిప్పికొట్టాలి – కొంగరి శంకర్ మాదిగ

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణం.లో నిర్వహించిన జిల్లా సమావేశంలో ముఖ్య అతిథిగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలపై మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ తీవ్రంగా స్పందించారు.

దేశంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోకముందే రిజర్వేషన్లు తొలగించాలనే డిమాండ్ చేయడం సామాజిక న్యాయాన్ని తిరస్కరించడమేనని అన్నారు.“రిజర్వేషన్లు ఎవరి దయతో వచ్చినవి కావు, రాజ్యాంగం కల్పించిన హక్కు. కుల వివక్షను నిర్మూలించకుండా రిజర్వేషన్లను నిర్మూలించాలని కోరడం ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించారు. కాబట్టి దేశ ఎస్సీ,ఎస్టీ,బీసీ ప్రజలారా మన వెనుక గోతులు తీసే ప్రయత్నం జరుగుతుంది.

దీని వెనక బీజేపీ పార్టీ,ఆర్.ఎస్.ఎస్ ఉంది కాబట్టి ఎస్సీ,ఎస్టీ,బీసీ ప్రజలు గమనించాలి, అందరూ సంఘటితం అయ్యి అల్టర్ గా ఉండి కుట్రలను తిప్పి కొట్టాలి.భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పుకుంటున్నామని, కానీ పేదలకు అందుబాటులో నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఆర్థిక భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు.

లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఎంత ప్రజలకు చేరుతుందో ప్రభుత్వాలు ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని సబ్సిడీ రుణాలు ఇచ్చింది? ఎంతమంది దళిత యువతకు స్వయం ఉపాధి కల్పించింది? ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత నిధులు విడుదలయ్యాయి? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

“దళితుల పేరుతో బడ్జెట్లు కేటాయించడం కాదు.ఆ నిధులు దళిత కుటుంబాల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చాయో చూపించాలి. దళిత యువతకు రుణాలు, ఉపాధి, విద్య, భూమి, వ్యాపార అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలి” అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు,రిజర్వేషన్లను కాపాడుకోవడంతో పాటు దళితుల హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత కోసం మాదిగ హక్కుల దండోరా నిరంతరం పోరాడుతుంది.

రిజర్వేషన్స్ వ్యతిరేక శక్తులను బొంద పెట్టడానికి తెలంగాణ నుండి మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యం లో బయలుదేరుతాం అని కొంగరి శంకర్ మాదిగ స్పష్టం చేశారు. ఈ కార్యమంలో జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల కుమార స్వామి మాదిగ ,రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ మాదిగ ,హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి దొడ్డే రాజేందర్ ప్రసాద్ మాదిగ,మోతె స్వామి మాదిగ ,మందమర్రి పట్టణ అధ్యక్షుడు కొలుగురి విజయ్ కుమార్ మాదిగ, ఇల్లందకుంట మండల అధ్యక్షుడు స్వామిదాస్ మాదిగ , జమ్మికుంటా పట్టణ వైస్ ప్రెసిడెంట్ దొడ్డే రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story