Karimnagar: రైతులకు 50% సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతాంగానికి 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ షురూ అయింది.

GANESH, JAMMIKUNTA
Published on: 25 May 2026 5:05 PM IST
Karimnagar
X

Karimnagar: రైతులకు 50% సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను సోమవారం నుండి పంపిణీ చేస్తున్నట్లు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపళ్లి లోని రైతు ఆగ్రోస్ ఎరువుల దుకాణంలో సోమవారం సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ.రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

పంట ప్రారంభానికి ముందు వ్యవసాయ భూములలో పోషక విలువలను పెంచేందుకు జీలుగ విత్తనాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండలాలలో మండలానికి 280 క్వింటాళ్ల చొప్పున జీలుగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 30 కేజీల బ్యాగు ధర రూ.2,453 లు అని, 30 కిలోల సంచి రెండున్నర ఎకరాల వరకు వేసుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్, పిఎసిఎస్ జమ్మికుంట చైర్మన్ పొనగంటి సంపత్, మార్కెట్ సూపర్వైజర్ బాబా, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story