Jammikunta: జమ్మికుంట మార్కెట్ చైర్ పర్సన్ స్వప్న జన్మదిన వేడుకలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు.

GANESH, JAMMIKUNTA
Published on: 21 July 2026 4:37 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట మార్కెట్ చైర్ పర్సన్ స్వప్న జన్మదిన వేడుకలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జన్మదిన వేడుకలను మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ.రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ సహకారంతో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద రెండవ వ్యవసాయ మార్కెట్ గా గుర్తింపు పొందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా రైతులకు సేవ చేసే అదృష్టం దక్కడం ఆనందంగా ఉందన్నారు.

తన భర్త సదానందం 22 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశాడని అందుకు గుర్తింపుగా తమకు మార్కెట్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసిన సందర్భంగా ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించిన మార్కెట్ ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో చైర్ పర్సన్ చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేసి రైతులకు, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ సహాయ కార్యదర్శి రాజా, సూపర్వైజర్స్ బాబా, సురేందర్, అరుణ్, ప్రదీప్, శంకర్ రెడ్డి, వీరన్న, సంపత్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story