Jammikunta: జమ్మికుంటలో యూనిఫాం స్టిచ్చింగ్ సెంటర్లను తనిఖీ చేసిన పీడీ

Jammikunta: జమ్మికుంటలో స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కేంద్రాలను పరిశీలించిన మెప్మా పీడీ స్వరూప రాణి. ఆగస్టు 10లోగా దుస్తులు అందజేయాలని టైలర్లకు ఆదేశం.

GANESH, JAMMIKUNTA
Published on: 1 Aug 2026 4:45 AM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో యూనిఫాం స్టిచ్చింగ్ సెంటర్లను తనిఖీ చేసిన పీడీ

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జమ్మికుంట, హుజురాబాద్ మెప్మా సంఘసభ్యులు స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ చేయు కేంద్రాలను మెప్మా పిడి స్వరూప రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం స్కూల్ యూనిఫాం కుట్టే కేంద్రాలను స్వయంగా పరిశీలించారు.

టైలర్ లకు పలు సూచనలు చేస్తూ యూనిఫాం కట్టే ప్రతి టైలర్ 12 అంశాలైన సూత్రాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు నాణ్యతగా యూనిఫాం కుట్టి అందించాలన్నారు. నేడు వెల్ఫేర్ పాఠశాలలో యూనిఫాం అందించాలని, ఆగష్టు నెల 10వ తేదీ వరకు స్కూల్ పిల్లలకు యూనిఫామ్ లు ఇవ్వాలి అని పీడీ ఆదేశించారు.

పీడీ స్వయంగా స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ మెలుకువలు తెలిపారు. ఆర్పి, ఓబిల రివ్యూ సమావేశానికి మెప్మా పిడి స్వరూప రాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిడి స్వరూప రాణి బి.ఎల్. వో వర్క్ లేని అర్పిలు, ఓబిలతో మెప్మా కార్యక్రమాలు బ్యాంక్ లింకేజ్, కొత్త సంఘాల ఏర్పాటు, చీరల పంపిణీ, సంఘ సభ్యుల ఆధార్ సీడింగ్ వంటి అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించగా వారం రోజుల వ్యవధిలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అర్పిలు తెలిపారు.

మళ్ళీ నిర్వహించే ప్రత్యేక సమావేశం వరకు పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని అర్పిలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెప్మా డి.ఏం.సి శ్రీవాణి, టి.ఎల్.ఎఫ్. ఓబీలు గీత, జ్యోతి, సి ఎల్.అర్పిలు జ్యోతి, మంజుల, అర్పిలు విజయ, అభేదభాను, మాలతి, సంధ్య, ఉమ, శిరీష, శ్రీదేవి, శ్రీలతలతో పాటు పలువురు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story