Jammikunta: జమ్మికుంటలో తెలంగాణ అవతరణ సంబరాలు
Jammikunta: అమరవీరులకు నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్. తన విద్యార్థి ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న చైర్మన్.
Jammikunta: జమ్మికుంటలో తెలంగాణ అవతరణ సంబరాలు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి గాంధీ చౌరస్తాలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం అమరులైన అమరవీరులకు నివాళులర్పించి గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ముందుగా జమ్మికుంట పట్టణ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నాడు విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం కొట్లాడి కేసులో పాలై పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరిగింది.
నేడు జమ్మికుంట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా భావిస్తూ తెలంగాణ కోసం అమరులైన విద్యార్థులను స్మరించుకుంటూ అమరులకు నివాళులర్పించి వీరులారా వందనం అంటూ గేయాన్ని ఆలపించిన మున్సిపల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి,వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ ,మేనేజర్ జి రాజిరెడ్డి, గౌరవ కౌన్సిలర్స్ ఒగు రమేష్. చింతల శ్రీనివాస్ . శిరీష రవి. మొలుగు ప్రణీత.చుంచు రమాదేవి. కౌన్సిలర్లు తదితరులు. కార్యాలయ సిబ్బంది తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.




