Jammikunta: కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్

Jammikunta: కరీంనగర్ జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మొలుగు ప్రశాంత్ పూర్తి మద్దతు.

GANESH, JAMMIKUNTA
Published on: 18 Jun 2026 8:57 PM IST
Jammikunta
X

Jammikunta: కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (CITU) ఆదేశానుసారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ కొలుగురి తిరుపతి, శ్రీనివాస్, రాసపల్లి సంజీవ్, మరేపల్లి ప్రశాంత్ తదితరులు చేస్తున్నటువంటి రిలే దీక్షలకు మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్నవి న్యాయమైన న్యాయమైన డిమాండ్ల గా తెలుపుతూ వారు కోరినట్లుగా మున్సిపాలిటిలో పని చేసే జౌటోసోర్సింగ్ ఎన్ఎమ్ ఆర్ పిక్స్ పే కార్మికులను పర్మినెంట్ చేయాలి.

2వ పిఆర్సి ప్రకటించి కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి కేటగిరి వేతనాలు అమలు చేయాలి మున్సిపాల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా డబుల్ బెడ్రూమ్స్, ఇందిరమ్మ ఇల్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి మున్సిపాల్ కార్మికులకు మరణిస్తే దహనం ఖర్చులకు 30 వేల రూపాయలు ఇవ్వాలి మున్సిపాల్ కార్మికులకు ఒక్కపూట 8 గంటల పని విధానం అమలు చేయాలి.

ప్రతి సంవత్సరం మున్సిపాల్లో పనిచేసే శానిటేషన్, వాటర్ వర్క్స్ హరితహారం, ఎలక్ట్రిషన్, డ్రైవర్లకు రక్షణ పరికరాలు అందజేయాలి. మున్సిపాల్ పరిధిలో పనిచేసే డ్రైవర్లకు,జవాన్లకు మిగతా వారి వలె డ్రైవర్స్ కేటగిరి వేతనం ఇవ్వాలి అని తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కొలుగురి సురేష్,ఫిరోజ్, మంద రాజేష్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story