Jammikunta: మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి - చైర్మన్
Jammikunta: జమ్మికుంటలో నీటి కొరత దృష్ట్యా వినాయక చవితికి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపు.
Jammikunta: మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి - చైర్మన్
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని యువతీ,యువకులు,నాతో సహా వినాయక మండప నిర్వాహకులు, భక్తులందరం మట్టి గణపతినే ప్రతిష్ఠించి పూజించాలనే సంకల్పంతో ముందుకు సాగుదాం ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురవడంతో జమ్మికుంట పట్టణంలోని చెరువుల్లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది.
కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వినాయక నిమజ్జనానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినప్పటికీ, నీటి కొరత కారణంగా పరిస్థితి సవాలుగా మారింది ఈ నేపథ్యంలో మట్టి గణపతిని పూజించడం ఎంతో అనుకూలమైన మార్గం.
తక్కువ నీటిలోనే మట్టి గణపతిని నిమజ్జనం చేయవచ్చు మట్టి విగ్రహం నీటిలో త్వరగా కరిగిపోవడంతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు అందువల్ల రాబోయే సంవత్సరాల్లోనూ నిమజ్జన కార్యక్రమాలకు ఉపయోగపడేలా అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది పట్టణంలోని ప్రతి గణపతి మండపాల నిర్వాహకులు,భక్తులు ఈసారి మట్టి గణపతినే ప్రతిష్ఠించి పూజించి మన సంప్రదాయాలను.
కాపాడుతూ,పర్యావరణన్ని పరిరక్షిస్తూ,నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమానికి సహకరిద్దాం మట్టి గణపతి మన సంప్రదాయానికి ప్రతీక,పర్యావరణ పరిరక్షణకు మార్గం అందరూ సహకరించాలని ఆయన కోరారు




