Jammikunta: పట్టణ అభివృద్దే లక్ష్యం వార్డులలోని సమస్యలను పరిష్కరిస్థాం
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' వార్డు సభలు.
Jammikunta: పట్టణ అభివృద్దే లక్ష్యం వార్డులలోని సమస్యలను పరిష్కరిస్థాం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డ్ సభలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మెన్ మొలగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి వార్డ్ సభల షెడ్యూల్ విడుదల చేసిన విధంగా శనివారం 4, 6, 10, 28, 29 వార్డులలో అభివృద్ధి పనులపై వార్డులలోని ప్రజలకు అవగాహన కల్పించి, వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి లు మాట్లాడుతూ వార్డులలో ఉన్న ప్రధాన సమస్యలు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, జల్ సంచయ్ – జల్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
డ్రైన్ల పూడికతీత, శుభ్రపరిచే పనులు, రుతుపవనాల సన్నద్ధతకు ప్రణాళిక, త్రాగునీటి సరఫరా, నిర్వహణ నీటి నిల్వల నివారణ, పారిశుధ్య చర్యలు, రోడ్ల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చేయవలసిన కార్యక్రమాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నిర్వహించినట్లు వారు తెలిపారు.
రానున్న వర్షాకాలం దృష్ట్య వార్డులలో పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), ఆర్ ఐ భాస్కర్, శ్రీనివాస్ ఐ రమేష్ లతో పాటు పలు వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.




