Jammikunta: మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్.. 'స్వేచ్ఛ ఆడబిడ్డ' పథకం ప్రారంభం!

Jammikunta: జమ్మికుంట మండలం తనుగులలో 'స్వేచ్ఛ ఆడబిడ్డ' పథకం ప్రారంభం. ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు రూ.2,016 ఆర్థిక సాయం అందజేసిన ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్.

GANESH, JAMMIKUNTA
Published on: 23 Oct 2026 6:35 PM IST
Jammikunta
X

Jammikunta: మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్.. 'స్వేచ్ఛ ఆడబిడ్డ' పథకం ప్రారంభం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల గ్రామ ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు "స్వేచ్ఛ ఆడబిడ్డ" పేరిట ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.2,016 ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

నాటి మాటను నేడు (శుక్రవారం) నిలబెట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు ఆడ బిడ్డలకు రూ.2,016 చొప్పున అంబాల రజనీకాంత్ జన్మదినం సందర్భంగా అందజేశారు. ఆడపిల్ల జన్మను గౌరవిస్తూ, ఆడబిడ్డల పట్ల సమాజంలో గౌరవాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే గొప్ప ఆశయంతో “స్వేచ్ఛ ఆడబిడ్డ పథకాన్ని” ఉపసర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ ప్రారంభించడం పట్ల సర్పంచ్ జక్కె కిరణ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

"స్వేచ్ఛ ఆడబిడ్డ" వాల్ పోస్టర్ ను అందరూ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ.ఆడపిల్ల అంటే భారం కాదు ఒక కుటుంబానికి వరం, సమాజానికి గర్వకారణం అని, ప్రతి ఆడబిడ్డకు గౌరవం, ప్రేమ, సమాన అవకాశాలు అందాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.

ఆడపిల్ల పుట్టుకను గౌరవించే ఆలోచన మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని, ఈ పథకం ఆడబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామనీ పేర్కొన్నారు.

ఆడబిడ్డను గౌరవిద్దాం ఆడబిడ్డను ఆదరిద్దాం ఆడపిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం అని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఆఫీసుకు " గ్రామ పంచాయతీ కార్యాలయం" పేరిట బోర్డు ను సైతం ఉప సర్పంచ్ దంపతులు బహూకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్ జక్కే, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA