Jammikunta: జమ్మికుంటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Jammikunta: జమ్మికుంట అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు. ఉద్యమకారులను ప్రభుత్వాలు గుర్తించి సత్కరించాలని డిమాండ్.
Jammikunta: జమ్మికుంటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అమరవీరుల స్తూపం వద్ద.. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జమ్మికుంట శాఖ అధ్యక్షులు మద్దూరి శంకరయ్య ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఉద్యమకారులు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సెక్రెటరీ జనరల్ జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం కొరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు.అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే ఈరోజు మన స్వరాష్ట్రంలో స్వతంత్ర వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు.
అయితే ఉద్యమకారులను 15 ఆగస్ట్ జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగే అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఉద్యమకారులను గుర్తించి కలెక్టర్ గౌరవ సూచకంగా సత్కరించాలని డిమాండ్ చేశారు. అలా చేయడం ద్వారా భావితరాలకు తెలంగాణ చరిత్ర ఉద్యమకారుల గురించి తెలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో.ఉద్యమకారులు నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ రెడ్డి, రచ్చ గణేష్ ,పాతకాల ఓదేలు, రామ్ రాజబాబు, మోతే స్వామి, ఎగిత కొమురయ్య, ఏబూషి ఓదెలు, గండికోట సమ్మయ్య, బిట్లు రమేష్, బిట్ల శీను, పొడేటి అనిల్, కొంగరి రవీందర్ .మొలుగు శీను, మోతే రాజు, తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.




