Jammikunta: జమ్మికుంటలో విద్యోదయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jammikunta: శంకరానందన్ గార్డెన్‌లో గురువులకు ఘన సన్మానం, స్కూల్ రోజుల నాటి జ్ఞాపకాల రీ-క్రియేషన్.

GANESH, JAMMIKUNTA
Published on: 31 May 2026 7:01 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో విద్యోదయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ పాఠశాలలో 2000 -2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు స్థానిక శంకరానందన్ గార్డెన్ లో అపూర్వ సమ్మేళనము నిర్వహించారు.పదవ తరగతి గదులలో చేసినటువంటి చిలిపి చేష్టలు ,అల్లరి పనులు, ఉపాధ్యాయులు బోధించినటువంటి విషయాలను వారు గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల వేషధార ణతో పాఠశాలకు లేటుగా రావడం, విద్యార్థిని ప్రశ్నలు అడగడం, ఉపాధ్యాయులు దండించిన తీరు కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారు .

తాము చదువు చెప్పిన విద్యార్థులు నేడు వివిధ రంగాలలో ఉన్నతులుగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పుడున్న స్థాయి కంటే వారి వారి రంగాలలో ఇంకా ఎదగాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తమకు విద్య బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉపాధ్యాయులను శాలువలతోఘనంగా.సన్మానించారు. అనంతరం విద్యార్థులు అలరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ యెబూషి ఆర్యన్ కౌశిక్, ప్రధానోపాధ్యాయులు యెబూషి శ్రీనివాస్,వైస్ ప్రిన్సిపల్ ఏ బూషి శ్రీనివాస్, మిడిదొడ్డి సమ్మయ్య, మర్రి అవినాష్, వెంకటేశ్వర్లు, మిల్కురి లక్మి నారాయణ, రామూర్తి, చంద్రమౌళి, మధుసూదన్, రాజశేఖర్,పూర్వ విద్యార్థులు డాక్టర్ ఊడుగుల సురేష్, బిట్ల.రమేష్,శీలం మమత,పోనగంటి రవికుమార్, భవాని, ఆకులసతీష్, జి శ్రీనివాస్, మంజుల, రమేష్, పోనగంటి సతీష్, కిషన్, మహిపాల్, రాములు, స్వప్న, సుప్రజ, శైలజ, సుమన్, తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story