Jammikunta: నాయిని చెరువు వద్ద చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట నాయిని చెరువు వద్ద అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ లైట్లు వెలగక మోత్కూలగూడెం మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది.

GANESH, JAMMIKUNTA
Published on: 18 Oct 2026 9:23 PM IST
Jammikunta
X

Jammikunta: నాయిని చెరువు వద్ద చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు లక్షలాది రూపాయలు కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కనీస ఏర్పాట్లు కొరవడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు వద్ద బతుకమ్మ కోసం ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణ ఆకర్షణీయంగా కనిపించినా, సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో మోత్కూలగూడెం వాసులు చీకట్లోనే బతుకమ్మ ఆటలు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి మున్సిపల్ అధికారులు.

మా ఊరిలోనే ఇద్దరు కౌన్సిలర్లు సొసైటీ చైర్మన్ ఉన్నా ఏమి లాభం అని అయితే నాయిని చెరువు వద్ద ఏర్పాట్ల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైట్లను ఏర్పాటు చేసి అలంకరణకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, అవి సక్రమంగా పనిచేసేలా చూడటంలో సంబంధిత నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బతుకమ్మ వేడుకల కోసం లక్షల రూపాయలు కేటాయించినట్లు చెబుతున్నప్పుడు, ఆ నిధులకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పండుగకు ముందస్తు ప్రణాళిక, విద్యుద్దీపాల నిర్వహణ, అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ, ఏర్పాట్లు తూతూమంత్రంగా సాగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఆడపడుచులు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ పండుగలో మహిళలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఇకనైనా ఇటువంటి లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, పండుగల పేరుతో కేటాయించే నిధుల వినియోగంపై పారదర్శకత పాటిస్తూ, క్షేత్రస్థాయిలో నాణ్యమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA