Jammikunta: జమ్మికుంట ఎస్ఐ సతీష్‌కు యువత ఘన వీడ్కోలు.. మిరుదొడ్డికి బదిలీపై వెళ్తున్న సందర్భంగా సన్మానం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్ఐ సతీష్ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి బదిలీ అయ్యారు.

GANESH, JAMMIKUNTA
Published on: 10 May 2026 8:07 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట ఎస్ఐ సతీష్‌కు యువత ఘన వీడ్కోలు.. మిరుదొడ్డికి బదిలీపై వెళ్తున్న సందర్భంగా సన్మానం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించి, పట్టణ యువతకుస్ఫూర్తిదాయకంగా నిలిచిన ఎస్ఐ సతీష్ ని యువత ఘనంగా సన్మానించింది. ఇటీవల ఆయన బదిలీపై సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి బదిలీ పై వెళ్తుండగా, యువత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ, ఎస్ఐ సతీష్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారికి మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు. మిరుదొడ్డిలో కూడా ఆయన మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట యువత పాతకాల ప్రవీణ్, సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, రాజకుమార్, అంబాలా అరుణ్, నాగరాజు, వెంకటేష్, ప్రకాష్ రాజ్, సంతోష్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story