Ramagundam: 26న జరిగే ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీలో ప్రజలు పాల్గొనాలి: ఠాకూర్!
Ramagundam: ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం పిలుపునిచ్చారు.
Ramagundam: 26న జరిగే ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీలో ప్రజలు పాల్గొనాలి: ఠాకూర్!
Ramagundam: ఈ నెల 26న హైదరాబాదులో జరిగే ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని MLA, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ పిలుపు.
దేశవ్యాప్తంగా ఓటు చోరీ, ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్ల తొలగింపు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని, ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు MS రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.
మంగళవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ఓటు చోరీపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, తొలుత విమర్శించిన వారు సైతం నేడు ఈ సమస్యపై స్పందిస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల ఓట్లు తొలగించారనే ఆరోపణలున్నాయని తెలిపారు.
రామగుండం నియోజకవర్గంలో కూడా వేల సంఖ్యలో ఓట్లు తగ్గినట్లు గుర్తించామని, మృతులు, వలస వెళ్లినవారు, డబుల్ ఓట్లు తదితర కారణాలతో పేర్లు తొలగించారని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీఎల్ఓలను సంప్రదిస్తూ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో తొలగింపుల్లో కొంతమేర సరిదిద్దగలిగామని, అయినప్పటికీ ఇంకా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన వారు, చిరునామా మారినవారు ఓటు హక్కును తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు.
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి పౌరుడు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మీడియా సమావేశంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు MD ముస్తఫా, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం
ఈ నెల 26న హైదరాబాదులో జరిగే ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని MLA, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ పిలుపు..
దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల ఓట్లు తొలగించారు,
రామగుండం నియోజకవర్గంలో కూడా వేల సంఖ్యలో ఓట్లు తగ్గినట్లు గుర్తించామని, మృతులు, వలస వెళ్లినవారు, డబుల్ ఓట్లు తదితర కారణాలతో పేర్లు తొలగించారూ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ఓటు చోరీపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, తొలుత విమర్శించిన వారు సైతం నేడు ఈ సమస్యపై స్పందిస్తున్నారని పేర్కొన్నారు.




