Sircilla: ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం చాటిన జర్నలిస్ట్ ఇస్మత్!

Sircilla: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ మహిళకు అత్యవసరంగా బి పాజిటివ్ (B+) రక్తం అవసరం కాగా, రెడ్ డ్రాప్ గ్రూప్ సభ్యుడు, జర్నలిస్ట్ ఇస్మత్.

KALEEM, SIRICILLA
Published on: 16 July 2026 11:31 PM IST
Sircilla
X

Sircilla: ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం చాటిన జర్నలిస్ట్ ఇస్మత్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ మహిళకు అత్యవసరంగా బి పాజిటివ్ (B+) రక్తం అవసరమైంది. ఈ విషయం రెడ్ డ్రాప్ గ్రూప్ సభ్యులకు తెలియడంతో వారు వెంటనే స్పందించారు.

గ్రూప్ సభ్యుడు, జర్నలిస్ట్ ఇస్మత్ ఆసుపత్రికి చేరుకుని తన 10వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సకాలంలో రక్తం అందడంతో గర్భిణికి అవసరమైన వైద్య సహాయం అందింది.

ఈ సందర్భంగా గర్భిణీ కుటుంబ సభ్యులు ఇస్మత్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. వరుసగా పదోసారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటిన ఇస్మత్ సేవలను రెడ్ డ్రాప్ గ్రూప్ సభ్యులు, వైద్య సిబ్బంది ప్రశంసించారు.

రక్తదానం మహాదానం.. ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదనే సందేశాన్ని ఇస్మత్ మరోసారి చాటిచెప్పారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story