Sircilla: అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు ఏడబోయిన నారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తోటి జర్నలిస్టులు.
Sircilla: అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!
Sircilla: అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు ఏడబోయిన నారాయణ కుటుంబానికి తోటి జర్నలిస్టులు అండగా నిలిచారు. గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామానికి చెందిన నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు మండలంలోని టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టులు కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించారు. ఈ నగదును నారాయణ భార్య సరితకు జర్నలిస్టులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఐజేయూ మండల అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, జర్నలిస్ట్ శంకర్ పాల్గొన్నారు.




